జగన్‌కు జూపూడి 'ది లీడర్': పులివెందులకు విజయమ్మ

YS Jagan - YS Vijayamma
హైదరాబాద్/కడప: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం పలువురు నేతలు కలిశారు. ఉదయం పదకొండు గంటలకు ములాఖత్ సమయంలో శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు జైలులో ఉన్న జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు జూపుడి పుస్తకాలు అందించినట్లుగా తెలుస్తోంది.

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర, స్వామి వివేకానంద జీవిత చరిత్ర, అమ్మ ది లీడర్ హూ హెడ్ నో అనే పుస్తకాలను జగన్‌కు జూపూడి అందించినట్లుగా తెలుస్తోంది. జైలులో ఉన్న జగన్ ప్రస్తుతం విఐపి ఖైదీలతో మాట్లాడుతూ, సాయంత్రం పూట షటిల్ అడుతూ, ఉదయం వార్తాపత్రికలు చదువుతూ గడుపుతున్నారు. ఖాళీ సమయాలలో చదివేందుకు మంచి పుస్తకాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

జూపూడితో పాటు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, బాబూరవు, బాలరాజు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు కలిశారు. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా జగన్‌ను ఉదయం కలిసిన విషయం తెలిసిందే. యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని జగన్‌ను ఓవైసీ కోరారు. మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ప్రభుత్వ విప్ పేర్ని నాని జైలులో కలిశారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఉప ఎన్నికల అనంతరం మొదటిసారి అమె పులివెందుల వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సాయంత్రం ఆమె పలు సమస్యలపై అధికారులతో మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+