విద్యార్థులపై నుండి దూసుకెళ్లిన బస్సు, ఒకరి మృతి

నారాయణ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్న అతుల్ లోయ, గోవింద్ జాజులు హోండా యాక్టివాపై కళాశాలకు వెళుతున్నారు. వారు కోఠి నుండి నారాయణగూడ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో వారి ముందు ఉన్న వాహనంలోని ఓ పోలీసు అనుకోకుండా వాహనం డోర్ తెరిచారని సమాచారం. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. వారికి పోలీసు వాహనం తాకి కిందపడ్డారు.
దీంతో అటు వైపు నుండి వెళ్తున్న ఓ ఆర్టీసి బస్సు వీరిపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతుల్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు, స్థానికులు గోవింద్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థులు అందరూ నారాయణగూడ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు.
వాహనం డోరు హఠాత్తుగా తెరిచిన పోలీసును వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే విద్యార్థుల మాత్రం పోలీసును అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. మృతుడు మలక్‌పేట వాసి.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications