ఎన్డియేలో విభేదాలు: పిఎ సంగ్మాకు బిజెపి మద్దతు

సంగ్మా అభ్యర్థిత్వం విషయంలో శివసేన, జెడి (యు) వంటి పార్టీల మద్దతును బిజెపి కూడగట్టలేకపోయింది. తమ సంప్రదించకుండా యుపిఎ ఖరారు చేసిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడడం సరి కాదని ప్రధాన ప్రతిపక్షంగా తమ పార్టీ భావిస్తోందని బిజెపి నాయకులు అంటున్నారు. పార్టీల మద్దతును కూడగట్టడానికి దర్యాప్తు సంస్థలతో పాటు వివిధ విపరీత పద్ధతులను కాంగ్రెసు ఉపయోగిస్తోందని బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ అన్నారు.
అన్నాడియంకె, బిజెడి ప్రతిపాదించిన సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని వారు చెప్పారు. దేశం బడా నాయకుల్లో ఒకరు, ఈశాన్య ప్రాంతం బడా నాయకుడు సంగ్మాకు మద్దతివ్వాలని శివసేనను, జెడి (యు)ని కోరామని, విభేదాలను పక్కన పెట్టాలని సూచించామని వారన్నారు.
సంగ్మా అభ్యర్థిత్వంపై విభేదాల వల్ల ఎన్డియేకు ఏ విధమైన సమస్యలు తలెత్తవని, ఎన్డియే మాచ్యుర్ సంకీర్ణంగా వ్యవహరిస్తుందని వారన్నారు. గతంలో శివసేన తమతో విభేదించి కాంగ్రెసు అభ్యర్థి ప్రతిభా పాటిల్‌కు వోటేసిందని, అయితే సంకీర్ణంలో కొనసాగుతోందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications