ఇప్పటికైనా కట్టడి చేయండి: కిరణ్ రెడ్డికి సోనియా క్లాస్

Kiran Kumar Reddy - Sonia Gandhi
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉప ఎన్నికలపై నివేదిక ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి కిరణ్ సోనియాకు ఉప ఎన్నికలపై నివేదిక ఇచ్చారు. సుమారు అరగంట పాటు వారు అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ముఖ్యమంత్రికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె ముఖ్యమంత్రికి సూచించారు. 2014 వరకు ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచేలా చూడాలని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు నివారించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందరిని సమన్వయం చేసుకొని వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెసును గెలుపు బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉప ఎన్నికలతో పాటు తెలంగాణ అంశం పైన కూడా సోనియా గాంధీతో వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా పిసిసి చీఫ్ బొత్స, సిఎం కిరణ్ రాష్ట్రం నుండి యుపిఏ సూచించిన ప్రణబ్ పేరును ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. కిరణ్ సాయంద్రం నాలుగున్నర గంటలకు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో, ఐదు గంటలకు ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు.

కాగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేతిలో అధికార కాంగ్రెసు పార్టీ చిత్తయిన విషయం తెలిసిందే. మొత్తం పద్దెనిమిది స్థానాలకు గాను పదిహేను స్థానాలలో జగన్ పార్టీ విజయకేతనం ఎగురవేయగా కాంగ్రెసు రెండు స్థానాలలో గెలుపొంది కొద్దిగా పరువు నిలుపుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+