ఎన్నికల ముందు ప్రణబ్ ముఖర్జీకి పిఏ సంగ్మా సవాల్

శుక్రవారం టివి ఛానల్స్‌తో మాట్లాడిన సంగ్మా... ప్రజాస్వామ్యం అంటే చర్చ అని, తాను చర్చను కోరుతున్నానని చెప్పారు. కాగా సంగ్మాను బిజెపి, బిజెడి, ఎఐడిఎంకె మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. తాను రాష్ట్రపతి ఎన్నికలలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను తృణమల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత బాల్ థాకరే అపాయింటుమెంటు కోరానని చెప్పారు. తాను ప్రతి ఒక్కరిని కలిసి తనకు మద్దతివ్వాల్సిందిగా కోరతానని చెప్పారు.
ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతాయని అన్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. తాను అంతరాత్మ ప్రభోదానుసారం వేసే ఓట్ల పైనే ఆధారపడ్డానని, దాని పైనే నమ్మకం పెట్టుకున్నానని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు, ప్రణబ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో దాదాపు అన్ని పార్టీల మధ్య చీలిక ఏర్పడిందన్నారు.
ఈ చీలిక రాష్ట్రపతి ఎన్నికలు ఎంత సీరియస్‌గా జరగనున్నాయో తెలియజేస్తోందన్నారు. కాంగ్రెసు భావించినట్లుగా అంతా స్మూత్‌గా ఎన్నికలు ఉండవన్నారు. యుపిఏలో కూడా ప్రణబ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో చీలిక వచ్చిందని చెప్పారు. యుపిఏ భాగస్వామ్యపక్షమైన టిఎంసి ప్రణబ్‌కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు.
తాను టిఎంసితో నిత్యం టచ్‌లో ఉన్నానని చెప్పారు. టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ తనకు మద్దతు ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. తాను మరి కొద్ది రోజుల్లో ఆమెను కలవనున్నానన్నారు. తాను చారిత్రక తప్పిదాలను సరి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తనకు ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సంగ్మా విజ్ఞప్తి చేశారు.
తాను జాతీయవాదిని అని, పేదల కోసం పని చేసే వ్యక్తిని అన్నారు. కేవలం నామమాత్రంగా తాను పోటీకి దిగలేదన్నారు. ప్రణబ్‌ను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications