ప్రభుత్వానికి ఢోకా లేదు, రాజీనామాలు లేవు: గవర్నర్

Narasimhan
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి తాను ఎటువంటి నివేదికలు ఇవ్వలేదని ఎపి గవర్నర్ నరసింహన్ మంగళవారం చెప్పారు. నరసింహన్ ఉదయం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు. మరికాసేపట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలవనున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రులు చిదంబరం, ఆంటోని తదితరులను కలుస్తానని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని నరసింహన్ ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన అనంతరం చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయటం లేదని అన్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదన్నారు.

కాగా సోనియా గాంధీతో భేటీ అయిన నరసింహన్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం గురించి ఆమె నరసింహన్‌ను అడిగినట్లుగా సమాచారం.

ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఉప ఎన్నికల ఫలితాలపై వేర్వేరు నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలల ప్రచారం కారణంగా జగన్ పార్టీ మెజార్టీ స్థానాలలో గెలిచిందని వారు నివేదిక ఇచ్చారు.

అయితే రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం అందుకు భిన్నంగా కాంగ్రెసు - ప్రజారాజ్యం పార్టీ నేతల మధ్య సమన్వయం లేక పోవడం వల్లనే ఓటమి చెందామని భావిస్తున్నారు. అదే విధంగా నివేదిక తయారు చేసిన చిరంజీవి సోనియా గాంధీకి ఇవ్వనున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+