తెలంగాణతో మాకు సంబంధం లేదు: మంత్రి ధర్మాన

నివేదిక సమర్పించడానికి తమకు గడువు ఏదీ లేదని, అయితే 15 రోజులలోగా ప్రాథమిక నివేదికను సమర్పిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయంపై తాము చర్చిస్తామని, ప్రభుత్వ పథకాల్లో చేయాల్సిన మార్పులను సూచిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఢత చూపపోవడానికి గల కారణాలను తెలుసుకుంటామని ఆయన చెప్పారు.
కమిటీ విధివిధానాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచనలు చేశారని ఆయన చెప్పారు. పరిస్థితులను బట్టి పార్టీలో మార్పులుంటాయని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలను అధ్యయన చేయాల్సిన అవసరం ఉందని తాము ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి తెలిపినట్లు ఆయన చెప్పారు.
ఇదిలా వుంటే, మంత్రుల కమిటీని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యతిరేకించారు. క్యాంప్ ఆఫీసులో కూర్చుని మంత్రుల కమిటీ సమీక్ష చేస్తే ఫలితం ఉండదని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో మేధోమథనం జరగాలని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేయాల్సి ఉంటుందని సోనియాకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, ఆ సానుభూతి ఎక్కువ కాలం ఉండదని ఆయన అన్నారు. మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా చూడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications