నాగార్జున అగ్రికెమ్‌లో రియాక్టర్ల పేలుళ్లు, మంటలు

క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ ఆవరణలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాదాపు 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎచ్చెర్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా మంత్రి కొండ్రు మురళి కర్నూలు నుంచి వెంటనే ఎచ్చెర్లకు బయలుదేరారు. ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు. ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరు కిలోమీటర్ల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications