సదానందకు షాక్: 8 మంది మంత్రుల రాజీనామా

జగదీష్ షెట్టర్, సిఎం ఉదాసి, మురుగేష్ ఆర్ నిరాని, బసవరాజ్ బొమ్మై, ఉమేష్ వి కత్తి, ఎంపి రేణుకాచార్య, వి సోమన్న, రేవునాయక్ బెలమాగి తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందించారు. శోభా కరండ్లాజే, నరసింహా నాయక్ (రాజు నాయక్) రాజీనామా చేసినవారిలో లేరు. వారు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వారి రాజీనామాలను ఆమోదించవద్దని బిజెపి అధిష్టానం సదానందకు సూచించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న సదానంద గౌడ శుక్రవారం సాయంత్రం రాజధానికి తిరిగి వచ్చారు. ఆయన శనివారం ఉదయం గవర్నర్‌ను కలిశారు. తాను సమస్యను పరిష్కరించుకుంటానని ఆయన గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. బిజెపి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ హుటాహుటిన బెంగళూర్ చేరుకుని సదానందతో చర్చలు జరిపారు.
తాను రాజీనామాలను ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని సదానంద రాజీనామాలు చేసిన మంత్రులతో చెప్పారు. మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి ఆమోదించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప అన్నారు. ముఖ్యమంత్రి శానససభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని, పార్టీ శానససభ్యుల సమస్యలను వినడం లేదని రాజీనామా చేసిన అనంతరం ఉదాసి మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications