తలసాని సూత్రమా: తెలుగుదేశంలో అంతా సైలెన్స్?

Chandrababu Naidu - Talasani Srinivas Yadav
హైదరాబాద్: 'తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీలోని పలువురు నాయకులు మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సూత్రాన్ని పాటిస్తున్నారా?' ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలలో పార్టీ దెబ్బతింటే ఫలితాల తర్వాత జోరుగా కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు వలసలు ఉంటాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే అలా అనుకున్నట్లు ఏమీ జరగలేదు. అందరూ ఊహించినట్లుగా నేతలు ఎవరూ జగన్ వైపు వెళ్లడం లేదు. అయితే పలువురు నేతల తీరు చూస్తుంటే మాత్రం ఏ క్షణంలోనైనా పార్టీని వీడి జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ పార్టీ నేతలు ఆ విషయాన్ని పలుమార్లు చెప్పారు. తమతో టిడిపికి చెందిన పలువురు నేతలు కూడా టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు.

కానీ టిడిపిలో మాత్రం ఎలాంటి అలజడి కనిపించడం లేదు. పార్టీలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకున్నప్పటికీ పలువురు నేతలు సమయం కోసం వేచి చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలామంది నేతలు జగన్ వైపుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని, కానీ జంప్ చేసేందుకు అదును దొరకక ఆగిపోయారని అంటున్నారు. వారి వైఖరి చూస్తుంటే తలసాని సూత్రాన్ని పాటిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ పదవి ఇచ్చినప్పటి నుండి తలసాని బాబు పైన, పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. ఆయన మాటలలో, చేతలలో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు పార్టీని వీడలేదు. టిడిపిలో ఉన్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. సమయం వచ్చినప్పుడు చెబుతానని, మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందని చెబుతూ దాట వేస్తున్నారు. విలేకరుల సమావేశం కూడా పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీని వీడుతున్నట్లు చెప్పలేదు.

ఆయన జగన్ వైపు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం ఏ అంశం పైనా పెదవి విప్పటం లేదు. ఇందుకు కారణం సరియైన సమయం చూసుకొని జంప్ చేస్తే బావుంటుందనే యోచనలో ఉన్నట్లు ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పంచన చేరదామనుకునే మిగిలిన నాయకులు కూడా ఆయన దారిలోనే ప్రస్తుతానికి సైలెన్స్‌గా ఉండి సమయం చూసుకొని జంప్ చేస్తామనే యోచనలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తాను వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వైపు వెళ్లనున్నట్లు ఆయన ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. తనకు ఏ పార్టీ బాగుంటుందనిపిస్తే ఆ పార్టీలో చేరతానని చెప్పారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా జగన్ వైపు చూశారనే ప్రచారం జరిగింది.

విజయవాడలో జగన్‌తో కలిపి నాని ఫ్లెక్సీలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ఆయితే ఆ తర్వాత ఆయన బాబును కలిసి వివరణ ఇచ్చారు. పార్టీలోనే ఉంటూ పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా కొందరి తీరు ఉందని చెబుతున్నారు. మరికొందరు అధినేత దృష్టిలో పడేందుకు కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీని వీడుదామని గట్టిగా నిర్ణయించుకున్న వారికి అడ్డు చెప్పకూడదనే నిర్ణయానికి బాబు వచ్చారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+