సిబిఐ జెడి లక్ష్మినారాయణపై సిపికి భూమన ఫిర్యాదు

Bhumana Karunakar Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన పోరును కొనసాగిస్తూనే ఉంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, తదితరులు ఢిల్లీ వెళ్లగా, తిరుపతి శానససభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు సిబిఐ జెడిపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ అనురాగ శర్మకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

దురుద్దేశ్యవూర్వకంగానే లక్ష్మినారాయణ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని అనురాగ శర్మను కలిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను జైలుకు పంపారని ఆనయ అన్నారు.

జగన్‌ను ద్వేషించే ఒక వర్గం మీడియాకు సమాచారాన్ని లక్ష్మినారాయణ లీక్ చేస్తున్నారని, తద్వారా జగన్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మాన్యువల్‌కు వ్యతిరేకంగా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము చేసిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అనురాగ శర్మ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరచే విధంగా లక్ష్మినారాయణ జగన్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి పనిగట్టుకుని వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన అన్నారు.

వైయస్ గన్ పట్ల సిబిఐ కక్ష సాధింపు తీరును ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు వివరిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. రైతాంగసమస్యలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌కు వివరించే ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+