తెలంగాణ: చంద్రబాబుపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు

తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఇద్దరు లాయర్లు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో మాట మార్చారని వారు కోర్టుకెక్కారు. కాగా 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించే కంటే ముందు చంద్రబాబు కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
అఖిలపక్ష సమావేశంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అంతకుముందు టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. అయితే డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటించాక మాత్రం చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారనేది తెలంగాణవాదుల వాదన.
కేంద్రం తెలంగాణ ప్రకటించిన మరుసటి రోజే చంద్రబాబు అర్ధరాత్రి ప్రకటనలపై మండిపడ్డారు. ఆ తర్వాత సీమాంధ్ర నేతలు వరుసగా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో కేంద్రం డిసెంబర్ 23న తెలంగాణపై చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గింది. అయితే ప్రకటన తర్వాత చంద్రబాబు యు టర్న్ తీసుకోవడం కూడా కేంద్రం వెనక్కి వెళ్లడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు టిటిడిపి నేతలు మాత్రం తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతున్నారు. బాబు కూడా తాము గతంలోనే నిర్ణయం చెప్పేశామని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications