పాతబస్తీలో కలకలం రేపిన పేలుడు, రంగారెడ్డిలో హత్య

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాతబస్తీలోనే ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ కత్తులతో పొడిచారు. ఈ ఘటనలో సబియా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఛత్రినాక పోలీసులు అక్కడకు చేరుకుని భర్త ఫయాజ్, మామను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఓ ప్రార్థనా మందిరం ఆధిపత్య పోరు ఓ యువకుడి ప్రాణాలు తీసింది. స్థానిక ప్రార్థనా మందిరం విషయంలో మంగళవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications