పాపను హింసించిన పెంపుడు తల్లి, ఒళ్లంతా గాయాలే

Child was beaten up
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆరేళ్ల పాపను ఘోరంగా హింసించిన సంఘటన వెలుగు చూసింది. పాపను దత్తత తీసుకున్న పెంపుడు తల్లి పాపను హింసించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీతారాంపేట గ్రామానికి చెందిన దేవీ తన కూతురును దత్తతకు ఇచ్చింది. ఒళ్లంతా గాయాలతో మూడు నెలల తర్వాత మధ్యవర్తి ఆ పాపను తీసుకుని వచ్చి తల్లికి అప్పగించింది.

సీతారాంపేటకు చెందిన దేవీ అనే మహిళలకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆమె ఆరేళ్ల కూతురును లక్ష్మి అనే మహిళ వేరేవాళ్లకు దత్తత కోసమంటూ, అక్కడ పాప బాగా ఉంటుందని, చదువుకుంటుందని చెప్పి పాపను తీసుకుని వెళ్లింది. పాపను ఎవరికి దత్తత ఇచ్చింది లక్ష్మి దేవికి చెప్పలేదు.

దత్తత పేరు మీద పాపను తీసుకున్నవాళ్లు ఆమెతో ఊడిగం చేయించారని, చిత్రహింసలు పెట్టారని తాజా పరిణామం తెలియజేస్తోందని అంటున్నారు. పాపను ఎవరూ కొట్టలేదని, పాపనే గాయాలు చేసుకుందని లక్ష్మి నమ్మబలికే ప్రయత్నం చేసింది. పది వేల రూపాయలు కూడా ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేసినట్లు చెబుతున్నారు.

పాపను ఆస్పత్రిలో చేర్చారు. గాయాలు ఇతరులు కొట్టడం వల్లనే జరిగాయని వైద్యులు చెప్పడంతో దేవీ కేసు పెట్టేందుకు సిద్ధపడింది. తల బొప్పి కట్టే విధంగా, ఎముకలు విరిగేలా కొట్టినట్లు తెలుస్తోంది. ఒంటిపై పలు చోట్ల కాలిన గాయాలు బొబ్బలెక్కిన గుర్తులు కూడా ఉన్నాయి. పెంపుడు తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, గోపిలతో పాటు మధ్యవర్తి లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+