హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలులో ఖైదీ వీరంగం, ఒకరి మృతి: స్పందించిన సబిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: చర్లపల్లి జైలులో దారుణం జరిగింది. తోటి ఖైదీ ఇతర ఖైదీలపై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేని నరసింహ అనే ఓ ఖైదీ జైలులో హల్ చల్ సృష్టించాడు. మానస బ్యారెక్‌లో ఉంటున్న అతడు లేచి నిద్రిస్తున్న తోటి ఖైదీ వెంకటయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటయ్య మృతి చెందాడు. జైళ్ల అధికారులు ఘటన అనంతరం నరసింహను బ్యారక్‌లో బంధించారు.

నరసింహను ఊషయ్య, చలపతిరావు అనే ఇద్దరు ఖైదీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై కూడా దాడి చేశాడు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మరో నలుగురు ఖైదీలకు కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని జైలు అధికారులు వెంటనే మహాత్మాగాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వెంకటయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరసింహ వారిపై కత్తెరతో దాడి చేశాడు.

నరసింహకు మతిస్థిమితం లేకపోవడం వల్లనే వీరంగం సృష్టించాడు. ఇతడు నాలుగేళ్లుగా జైలులో ఉంటున్నాడు. ఈ ఘటన జైలులో భద్రత ఎలా ఉందో తెలియజేస్తుంది. కాగా ఖైదీ వీరంగంపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేస్తామని చెప్పారు. అధికారుల తప్పు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జైళ్ళ శాఖ డిజిని ఆమె ఆదేశించారు. బ్యారక్ వార్డన్లను విధుల నుండి తొలగించారు.

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

English summary
A prisoner Narasimhan attacked on another prisoner in Charlapally jail on Wednesday morning. Venkataiah, 60 was died in this attack and seven injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X