రాయల తెలంగాణ: శ్రీకాంత్‌రెడ్డితో గొంతు కలిపిన బైరెడ్డి

రాయలసీమను ముక్కలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. తమ ప్రాణాలనైనా అర్పించి రాయలసీమ ఉనికిని కాపాడుకుంటామని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రాయలసీమ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విభజనను తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాను తమకు వద్దని కొందరు అంటున్నారని, తాము ఇస్తామని అంటున్నామా అని ఆయన అన్నారు. రాయలసీమ కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు ఏం చేయాలో తాము ఆలోచించుకుంటామని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న నాయకులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి బుధవారంనాడు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వంటి రాయలసీమ నాయకులు కొందరు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్రకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న మజ్లీస్ పార్టీ రాయల తెలంగాణకు అంగీకరిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావచ్చుననే మాట వినిపిస్తోంది. దీంతో రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులు గొంతు పెంచారు.












Click it and Unblock the Notifications