వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: లండన్ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను గురువారం అరెస్టు చేశారు. నిఘా విభాగాలతో కలిసి ముందస్తు పథకం ప్రకారం బ్రిటిష్ పోలీసులు ఆ అనుమానితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు వచ్చే ఒలింపిక్స్ క్రీడలతో సంబంధం లేదని మెట్రోపాలిటన్ పోలీసులు స్పష్టం చేశారు.

London Olympics 2012

ఉగ్రవాద చర్యలకు పురికొల్పడం, సిద్ధం కావడం, ప్రేరేపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానంపై పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ 29 ఏళ్ల వ్యక్తిని పశ్చిమ లండన్‌లోని వీధిలో అరెస్టు చేశారు. 21 ఏళ్ల యువకుడిని, 30 ఏళ్ల మహిళను పశ్చిమ లండన్‌లోని నివాసంలో అరెస్టు చేశారు.

తూర్పు లండన్‌లోని నివాసాల నుంచి 26, 18, 24 ఏళ్ల వయస్సు గల ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు లండన్‌లోని 8 నివాసాలు, వాణిజ్య కార్యాలయాల్లో ఉగ్రవాద చట్టం 2000 కింద సోదాలు కూడా నిర్వహించారు.

లండన్ ఒలింపిక్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశదేశాల నుంచి క్రీడాకారులు అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తాజా సంఘటన కాస్తా కలవరం కలిగిస్తోంది.

English summary
In an early morning swoop, British police on Thursday arrested five men and a woman in London as part of a per-planned intelligence-led operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X