మావోయిస్టుల ఘాతుకం: ఇద్దరి గొంతు కోసి చంపేశారు

Maoists
రాయపూర్: చింతల్‌నార్ ఎన్‌కౌంటర్ ఘటనకు మావోయీస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో పదిహేడు మందిని గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. సుకుమా జిల్లా చిమిలిపెంట గ్రామానికి చెందిన వ్యక్తులను వారు బుధవారం ఎత్తుకుపోయారు. వారిలో మడకంపెంట, దూల అనే ఇద్దరిని గొంతుకోసి హతమార్చారు. మిగిలిన పదిహేను మంది ఇంకా మావోల చెరలోనే ఉన్నారు. మరోవైపు విశాఖ-కిరండోల్ మార్గంలోని రైలు పట్టాలను వారు తొలగించారు.

కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు వేర్వేరు భారీ ఎన్‌కౌంటర్‌లు జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిహేడు మంది నక్సలైట్‌లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) జవాన్లు శుక్రవారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఇది తెలుసుకున్న నక్సలైట్‌లు బాసగూడ సమీపానికి జవాన్‌లు వచ్చాక వారిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అఫ్రమత్తమైన సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ జవాన్‌లను రాష్ట్ర రాజధాని రాయపూర్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరు జవాన్‌లకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఎదురు కాల్పులు దాదాపు ఆరు గంటలు సాగాయని సమాచారం. అవసరమైతే అదనపు బలగాలను పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్పుల అనంతరం సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని వారిని రాయపూర్ తరలించారు. గాయపడ్డ ఆరుగురు జవాన్‌లలో ఇద్దరు కోబ్రా కమాండోస్‌కు చెందిన వారిని అధికారులు చెప్పారు. కాగా ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం మావోల దాడిలో 75 మంది సిఆర్‌పిఎఫ్, ఒక పోలీసు మృతి చెందారు.

అయితే మృతి చెందిన వారు మావోయిస్టులు అని పోలీసు చెప్పగా, వారు అమాయకులని కేంద్రంపై పలువురు మండిపడ్డారు. సాక్ష్యాత్తూ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఈ ఘటనపై ధ్వజమెత్తారు. తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఘటనపై క్షమాపణలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+