మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండి శైలజా కిరణ్‌పై కేసు

2009 జూన్ 17న కె.సుభాషిణి ఆస్తిని తాను రూ. 57,50,000కు కొనుగోలు చేసినట్లు హషిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ స్థలాన్ని తాకట్టుపెట్టి మార్గదర్శి నుంచి సుభాషిణి తీసుకున్న రూ. 29,95,000ను నాలుగు దఫాలుగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒప్పందం ప్రకారం రెండుదఫాలుగా రూ. 20 లక్షలు చెల్లించిన హషిత మిగతా రూ. 9,95,000లకు గ్యారెంటీగా విజయా బ్యాంకు పేరు మీద ఓ చెక్కు ఇచ్చినట్లు తెలిపారు.
2009 మార్చి 28న మరో 3లక్షలు చెల్లించారు. మిగిలిన రూ. 6,95,000 మొత్తాన్ని చెల్లిస్తానని, తన స్థలం టైటిల్ డీడ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని చిట్‌ఫండ్ నిర్వాహకులను హషిత కోరింది. అయితే ఇంకా రూ. 8లక్షలు చెల్లిస్తేనే పత్రాలు ఇస్తామని వారు మాటమార్చినట్లు హషిత కోర్టుకు తెలిపారు. ఐపీసీ 406, 420, 509 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
తనకు నమ్మకద్రోహం చేయడమే కాకుండా, మోసానికి పాల్పడి పరుష పదజాలంతో దూషించి, బెదిరించారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చెరుకూరి శైలజా కిరణ్, విజయవాడ బ్రాంచి మేనేజర్ శ్రీనివాసరావులపై హషిత ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications