జగన్ పార్టీ బిసీలను అణచేస్తోంది: యనమల వ్యాఖ్య

వైయస్ జగన్ పార్టీ ఉన్న బీసీ నేతలు ఎంతమంది అని వారు ప్రశ్నించారు. తమ పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌ను భరించలేకపోతున్న జగన్ పార్టీ నేతలు తమ బాకా పత్రికలో దానిపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారని వారు విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బీసీ వర్గాల వారిని బిచ్చగాళ్ళుగా మార్చి తీరని అన్యాయం చేసిందని యనమల ఆరోపించారు.
తమ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఇరవై శాతం బీసీలకు కేటాయించామని వారు చెప్పారు. వైయస్ రాజశేఖ రెడ్డి చేసిందేమిటని వారు ప్రశ్నిస్తూ బీసీ రిజర్వేషన్లలో నాలుగున్నర శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాయని చెప్పారు.ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేం వ్యతిరేకం కాదని వారు చెప్పారు.
కానీ బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి ఇవ్వడం న్యాయం కాదని వారు అన్నారు. కడప జిల్లాలో వైయస్ కుటుంబ ఫ్యాక్షన్ రాజకీయాలతో బీసీలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్‌ను విమర్శిస్తున్న పార్టీలు దమ్ముంటే తమ పార్టీ కంటే అధికంగా బీసీలకు సీట్లు ఇస్తామని ప్రకటించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications