వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ అడుతూ... చెమటలు కక్కుతూ..: ఖుషీగా కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
రాజమండ్రి: ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖుషీ ఖుషీగా గడుపుతున్నారు. ఆయనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఆయన అనందిస్తూ.. విద్యార్థులలో ఉత్సాహం నింపారు. ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో బస చేసిన కిరణ్ ఆదివారం ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు.

కాసేపు జాగింగ్ చేశారు. అనంతరం ఆశ్రమ విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఆనందించారు. విద్యార్థులలో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత అక్కడి నుండి అమలాపురం బయలుదేరారు. బయలుదేరే ముందు కిరణ్ రంపచోడవరంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఐఏఎస్‌లపై చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి ఇంకా రాలేదని చెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు సంయమనంతో ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేసే విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అన్నీ కాంగ్రెసువే అన్నారు. ఆయన అమలాపురంలో రాజీవ్ యువకిరణాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ లభ్దిదారులతో భేటీ అవుతారు.

రంపచోడవరంలో భూపతిపాలం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని గిరిజన మహిళలు కిరణ్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అంతకుముందు రాత్రి కిరణ్ రాత్రి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

English summary

 Chief Minister of Andhra Pradesh, Kiran Kumar Reddy was played Cricket with Musurumilli asrama students on Sunday morning in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X