భార్య మార్కులతో భర్త ఉద్యోగం: రట్టు చేసిన సతీమణి

అతడి భార్య లత ఇచ్చిన సమాచారంతో సాఫ్టువేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా పని చేస్తున్న నందన్ అనే ముప్పై మూడేళ్ల వ్యక్తిని చంద్రలేఔట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తన ఇంటర్, బికాం మార్కుల జాబితాల్లో పేర్లు మార్చుకొని పలు బహుళజాతి సంస్థల్ని మోసగించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
పిహెచ్‌పి సంస్థలో 2005 నుండి 2008 వరకు, అమికార్ప్ సంస్థలో 2008 నుంచి 2011 వరకు పని చేసిన నందన్ ప్రస్తుతం ఐబిఎంలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఏడాదికి రూ.24 లక్షల వేతనాన్ని పొందుతున్నాడు. ఇతడు పాలిటెక్నిక్ డిప్లోమా ఫెయిల్ అయ్యాడని పోలీసులు గుర్తించారు. భర్త వేధిస్తుండటంతోనే భార్య పోలీసులకు సమాచారం అందించిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications