యాదవ్ నో: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జశ్వంత్ సింగ్

తొలుత ఎన్డీయే కన్వీనర్, జనతా దళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను బరిలో నిలపాలని బిజెపి సీనియర్లు భావించారని, అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని అద్వానీ తెలిపారు. నేతలంతా జశ్వంత్ సింగ్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. కాగా యుపిఏ అభ్యర్థిగా అహ్మద్ అన్సారీ బరిలో నిలవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా పోటీ తప్పడం లేదు. తనను ఎంపిక చేయడంపై జశ్వంత్ సింగ్ ఎన్డీయేకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నిక ద్వారా ఎన్డియేలో మనస్పర్ధలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్డియే కూటమిలో ప్రధాన పార్టీలైన శివసేన, జెడి(యు) తదితర పార్టీలు యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నాయి. ఎన్డియే అభ్యర్థి పిఏ సంగ్మాకు మద్దతిచ్చేందుకు నిరాకరించాయి.
దానిని పూడ్చుకునేందుకు బిజెపి ఉప రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తుందని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో శివసేన, జెడి(యు)లు జశ్వంత్ సింగ్‌కే మద్దతిచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications