రూ. 30 వేలకు 11 నెలల కన్నబిడ్డను అమ్మిన తల్లి

పేరెన్నిక గన్న మెదక్ చర్చిలో కున్యాల కనకమ్మ, వెంకటయ్య దంపతులకు ఆ మగబిడ్డను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక మహిళ యశోద చిన్నారి తల్లి యేషమ్మకు, కనకమ్మ దంపతులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భర్త వదిలేయడంతో యేషమ్మ సదాశివపల్లిలోని తన తల్లిగారింట్లో ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన రెండో కుమారుడిని అమ్మడానికి ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు.
యేషమ్మ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. వ్యవసాయ కూలీలుగానే పనిచేస్తున్న కనకమ్మ, వెంకటయ్యలు ఇంతకు ముందు దత్తత కోసం శిశు విహార కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. పిల్లలు లేని కనకమ్మ దంపతులు యేషమ్మ నుంచి బాలుడిని 30 వేల రూపాయలకు కొన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ యేషమ్మ తిరిగి తన బిడ్డను అడిగితే లక్షా 50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, తర్వాత యేషమ్మ మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించిందని అంటున్నారు. దీంతో కనకమ్మ దంపతులు సదాశివపల్లిలోని గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. యేషమ్మ అడ్వాన్స్‌గా తీసుకున్న పది వేల రూపాయలు తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించినట్లు చెబుతున్నారు. సమాచారం పొక్కడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, ఆ సంఘటనపై నోరు విప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
కాగా, విజయశాంతి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి, దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులను వేధించవద్దని ఆదేశించారు.












Click it and Unblock the Notifications