యుఎస్ అమ్ములొదిలోకి హైపర్‌సోనిక్, 4ఏళ్లలో సిద్ధం

ఈ హైపర్‌సోనిక్‌కు ఎక్స్ ప్లేన్ అని సంకేత నామం పెట్టారు. మాక్ 20 గంటకు దాదాపు 20,900 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దీనిని డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డిఏఆర్‌పిఏ) తయారు చేస్తోంది. ఇదే సంస్థ గత ముప్పై ఏళ్లుగా అమెరికాకు రహస్య ఎయిర్ క్రాఫ్ట్స్‌ను తయారు చేసి ఇస్తోంది. రెండేళ్లలో హైపర్‌సోనిక్ ప్రోటోటైప్ విమానాలను రెండింటిని ప్రయోగించింది.
గత ఏడాది ఆగస్టులో ఫాల్కన్ హైపర్‌సోనిక్ టెక్నాలజీ వెహికిల్ -2ను ప్రయోగించింది. మాక్-20కి చేరుకోగల్గినా గాలిలో కేవలం తొమ్మిది నిమిషాలు మాత్రమే ఉండగలిగింది. గూఢచర్య విమాన యుద్ధ తంత్రంలో ఇతర దేశాల నుండి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని అమెరికా సమీకృత హైపర్‌సోనిక్స్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు పరిశోధనలో ఐదు కీలకాంశాలపై దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications