పారిశ్రామికరంగంపై 'తెలంగాణ' ప్రభావం చూపదు: కిరణ్

2,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి 70 శాతం మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోందని చెప్పారు. విద్యుత్‌కు తగ్గ గ్యాస్ సరఫరా కాకపోవడమే కొరతకు కారణమన్నారు. మీ సేవ పరిధిలో ప్రస్తుతం 31 సేవలు ఉన్నాయని వాటిని 100కు పెంచుతామని ఆయన తెలిపారు. సమయం వచ్చినప్పుడు కేంద్రం తెలంగాణపై నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పారు.
పరిశ్రమలపై తెలంగాణ సమ్మెలు, బందుల ప్రభావం లేదన్నారు. 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం గెయిల్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ప్రయివేటు సెక్టార్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఎలాంటి విద్యార్హతలు లేని 3.75 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాయలార్ రవి ఢిల్లీలో అన్నారు. తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు.
కాగా విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదనంటే తామే బ్లాక్ నివేదికను విడుదల చేస్తామని బాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే టీడీపీ ధ్యేయమన్నారు. ఉపాధి హామిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సమస్యలపై అవగాహన లేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నల్గొండ జిల్లాలో ఆరోపించారు. జెన్ కోను నిర్వీర్యం చేసి ప్రయివేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications