హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ జైలులో ఉండేవారు కారు: శోభా నాగిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Nagireddy
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలనే తమ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పుపట్టడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి తప్పు పట్టారు. చంద్రబాబు చేస్తే పవిత్రత, ఇతరులు చేస్తే అపవిత్రత అంటారని, ఇదే పద్ధతిని ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసుతో తాము కమ్మక్కయినట్లు తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణను ఆమె ఖండించారు.

తాము కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయితే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలులో ఉండేవారా అని ఆమె ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చి ఉండేవారం కాదని, దాని వల్ల తాము తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదని ఆమె అన్నారు. ప్రణబ్ ముఖర్జీ సీనియర్ నేత, అనుభవజ్ఞుడు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకపోవడం మంచిది కాదని చంద్రబాబు అన్నారని ఆమె గుర్తు చేశారు.

చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడాన్ని నేరంగా పరిగణించాలని ఆమె అన్నారు. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు పార్టీ వ్యక్తి కారని, అందుకే తాము ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేస్తున్నామని ఆమె చెప్పారు. జెడి(యు) నేత శరద్ యాదవ్, లోకసత్తా నేత జయప్రకాశ్ నారాయణ ఓటేశారని, వారు కూడా కాంగ్రెసుతో లాలూచీ పడినట్లేనా అని ఆమె అన్నారు. కాంగ్రెసుతో ప్రణబ్ ముఖర్జీకి సంబంధం లేదని ఆమె అన్నారు. ప్రణబ్ సరైన అభ్యర్థి అని తాము ఓటేశామని ఆమె అన్నారు. తాము మొత్తం 20 మందిమి ఓటేయడానికి వచ్చామని, ఆళ్ల నాని, రంగారావు, బాలనాగిరెడ్డి కూడా వచ్చారని ఆమె అన్నారు.

తాము కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయినట్లు వచ్చిన ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో తాము కుమ్మక్కవుతామా అని ఆయన అడిగారు. ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల కన్నా తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సమర్థుడు కాబట్టే తాము ప్రణబ్ ముఖర్జీకి ఓటేశామని ఆయన అన్నారు.

English summary
YSR Congress party MLA Shobha Nagi Reddy said that if her party is colluded with Congress YS Jagan will not be in the jail. She condemned Telugudesam party president N Chandrababu Naidu's allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X