ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎండి అరెస్టు, ఆదిత్య లొంగుబాటు

రమేష్ రెడ్డి నుంచి పోలీసులు విలువైన పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లాకర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిటీ ఆన్‌లైన్ మార్కెంటింగుకు ఐదు శాఖలున్నాయి.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మంజూరు వ్యవహారంలో కేసులో జూనియర్ న్యాయవాది ఆదిత్య గురువారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ వ్యవహారంలో కోటి రూపాయలకు పైగా ముట్టినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుంచి గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంలో తెర వెనక పాత్రను ఆదిత్య నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఆదిత్యకు కోర్టు ఆగష్టు 2 వరకు రిమాండ్ విధించింది. గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది ఉమామహేశ్వర్ జూనియర్‌గా ఆదిత్య పనిచేస్తున్నారు. ఈ కేసులో ఐదో నిందితుడుగా ఉన్న ఆదిత్య మధ్యవర్తుల ద్వారా గాలి బెయిల్ కోసం కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసులు నమోదైనప్పటి నుంచి ఆదిత్య పరారీలో ఉన్నాడు. రెండు నెలలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications