వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేసిన చిన్నం, బాలనాగిరెడ్డి: రాజేష్‌తో జగన్ ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam Ramakotaiah - Balanagi Reddy
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలు గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులోని నెంబర్ 63వ గదిలో ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ వచ్చే వారు ప్రతి ఒక్కరు తమ గుర్తింపు కార్డును తీసుకు వస్తేనే ఓటు వేయనిస్తున్నారు. పార్లమెంటులో మన రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఓటు వేసేందుకు అవకాశం లభించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఢిల్లీలో ఓటింగ్‌కు అవకాశం ఇస్తారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డిలు అసెంబ్లీలో ఓటు వేశారు. టిడిపి రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వారు ఓటు వేశారు. బాలనాగి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతగా ముద్ర పడగా, చిన్నం రామకోటయ్య కాంగ్రెసు వైపుకు వెళుతున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేశారు.

చిన్నం మంత్రి పార్థసారధితో కలిసి తన ఓటును వేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటు వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు అసెంబ్లీలో తమ ఓటును వేశారు. ఓటు వేసేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు రాజేష్, బాలరాజులు కలిసి ఒకే కారులో రావడం గమనార్హం. ఓటు వేసేందుకు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో గురువారం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజాప్రతినిధులు అందరూ వస్తుండటంతో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో అసెంబ్లీ ముందు నుండి వచ్చి పోయే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలోని శాసనసభ భవనాలలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి.

English summary
Nuziveedu and Mantralayam Telugudesam Party mlas Chinnam Ramakotaiah and Balanagi Reddy were used there votes in presidential votes on Thursday in Hyderbad assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X