వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగ్మా చెప్పినట్లుగా 1969 పునరావృతమవుతుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indira Gandhi - PA Sangma
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలలో 'లెక్క' చూస్తుంటే యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీయే మద్దతు ప్రకటించిన పిఏ సంగ్మా కూడా తన గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఆయన మొదటి మొదటి నుండి ఆత్మ ప్రభోదానుసారం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. పైకి ఎలా ఉన్నా ప్రజాప్రతినిధులు ఆత్మప్రభోదానుసారం ఓటేస్తారని, తద్వారా తన గెలుపు ఖాయమని చెప్పారు. 1969 నాటి పరిస్థితి మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతుందని సంగ్మా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఓటింగ్ ఈ రోజు పూర్తయినప్పటికీ ఫలితాలు 22న వస్తాయి. రాష్ట్రపతి ఎన్నికలలో మొత్తం 10,98,882 ఓట్లు ఉన్నాయి. ఓ అభ్యర్థి గెలవాలంటే 5,49,442 ఓట్లు కావాలి. అధికారికంగా పార్టీలు, ప్రజాప్రతినిధులు ప్రకటించిన ప్రకారం... ప్రణబ్‌కు 7.2 లక్షలు, సంగ్మాకు 3.13 ఓట్లు వస్తాయి. 36వేల ఓట్లు తటస్థం. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే 42 మంది ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల సంఖ్య 29,736. రాజ్యసభ సభ్యుల సంఖ్య 18. వారి ఓట్లు 12,744. శాసనసభ్యులు 294 మంది. వారి ఓట్లు 43,512. ఇందులో టిడిపి, టిఆర్ఎస్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

దేశంలో మొత్తం ఎంపీల ఓట్లు 3,85,860. రాజ్యసభ ఓఠ్లు 1,17,000. పూర్తిగా చూస్తే ఎంపీల ఓట్లు 5,49,408 ఉండగా, ఎమ్మెల్యేల ఓట్లు 5,49,474 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అందులో 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా మన రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్లమెంటులో ఓటు వేసేందుకు అనుమతి లభించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు హైదరాబాదులో ఓటేసేందుకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా 77మంది ఎంపీలకు సొంత రాష్ట్రాలలో ఓటేసేందుకు అనుమతి లభించింది. ఇది 14న రాష్ట్రపతి ఎన్నిక.

English summary
Nuziveedu and Mantralayam Telugudesam Party mlas Chinnam Ramakotaiah and Balanagi Reddy were used there votes in presidential votes on Thursday in Hyderbad assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X