మరింత క్రియాశీలక పాత్రకు రెడీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi
న్యూఢిల్లీ: పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ చెప్పారు. తాను పోషించాలని పాత్రను పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన గురువారం చెప్పారు. తాను మరింత కీలకమైన పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

పార్టీలో, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాంధీయేనని సోనియా గాంధీ బుధవారం అన్నారు. ఆమె మాటల నేపథ్యంలో రాహుల్ గాంధీ తాను క్రియాశీలకమైన, కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

పార్టీలో రాహుల్ గాంధీ నిర్వహించాల్సిన పాత్రను ఇతరులు ఎవరూ నిర్ణయించబోరని, రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పార్టీలో మరిన్ని బాధ్యతలను తీసుకుంటూ ముఖ్య పాత్రను పోషించే విషయంలో నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి హమీద్ అన్సారీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన సోనియా గాంధీ పార్లమెంటు హౌస్‌లో బుధవారం ఆ విధంగా అన్నారు.

రాహుల్ గాంధీ పార్టీలో మరింత ముఖ్య భూమికను పోషిస్తారని, తన పార్టీకి సంబంధించి మరింత ఎక్కువ బాధ్యతలను చేపడుతారని దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్జీద్ వంటి నాయకులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోనియా గాంధీ ఆ విధంగా ప్రతిస్పందించారు.

2014 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లేదా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలున్నాయా అని అడిగితే అది రాహుల్ నిర్ణయించుకోవాల్సిందేనని సోనియా అన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+