హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ ధర్నాకు నో పర్మిషన్, కోర్టుకెక్కిన పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijaymmma
హైదరాబాద్ : కరీనంగర్ జిల్లా సిరిసిల్లలో ఈనెల 23న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ 'నేతన్న ధర్నా' కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో దాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిథి జె. యాదగిరి దాఖలు చేశారు.

పిటిషన్‌లో కరీంనగర్ జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిరిసిల్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒకరోజు ధర్నాచేయడానికి తమ పార్టీ పిలుపు నిచ్చిందని, ఈ కార్యక్రమానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరువుతున్నారని పిటిషన్‌లో తెలిపారు.

ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ శాంతి యుతంగా ధర్నా చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ధర్నాకు అనుమతించాలని కోరుతూ ఈనెల 13న స్థానిక పోలీసులకు దరఖాస్తు చేస్తే నిరాకరించినట్లు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీ నిరసన కార్యక్రమానికి అనుమతించక పోవడం అన్యామని, ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్టున్నారని, ఇది ప్రజాస్వామ్య విధానం కాదని పిటిషన్‌లో అన్నారు. ఈ నెల 23న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన 'నేతన్న ధర్నా' కు అనుమతించాలని పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

English summary
police have rejected permission to YSR Congress honorary president YS Vijayamma's dharna at Siricilla of Karimnagar district. YSR Congress leader Yadagiri filed petition challenging the police decission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X