తివారీకి చుక్కెదురు, గోప్యంగా ఉంచలేమన్న హైకోర్టు

కేసు విచారణ లోననే జరగాలని కూడా ఆయన కోరారు. తివారీని తన కన్నతండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ 2008లో పిటిషన్ దాఖలు చేశారు. తివారీ, రోహిత్, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్ఎ పరీక్షలు నివేదికను హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్‌ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం ఇటీవల సమర్పించింది.
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో తివారీ మే 29వ తేదీన డెహ్రాడూన్‌లోని తన నివాసంలో రక్త నమూనాలను ఇచ్చారు. అయితే తివారీ విజ్ఞప్తిపై రోహిత్ శేఖర్, ఉజ్వల శర్మ - నివేదికను బహిరంగ పరచాల్సిందేనని కోరారు. తన తల్లి ఉజ్వల శర్మతో సంబంధం వల్లనే తివారీకి తాను పుట్టానని రోహిత్ శేఖర్ వాదిస్తూ వస్తున్నాడు.
తాను తివారీకి పుట్టానని రోహిత్ శేఖర్ వాదనలోని నిజాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని అదేశించింది. అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ వచ్చారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications