ఓట్ల లెక్కింపు ప్రారంభం: ప్రణబ్ ఇంటి వద్ద కోలాహలం

గెలిచిన అభ్యర్థి ఈ నెల 25న 4వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రణబ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆయన ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుండి కోలాహలం కనిపిస్తోంది. భారీగా నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలి వస్తున్నారు. ప్రణబ్ కూడా తన గెలుపు ఖాయమనుకుంటున్నారు. ఆయన మెజార్టీ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా అందరూ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రణబ్ మాత్రం పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. ప్రణబ్‌కు దాదాపు డెబ్బై శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు పిఏ సంగ్మా తన ఓటమి ఖాయమని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంటి వద్ద ఎలాంటి హంగామా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications