గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వస్తానంటే సరే, కవిత సొత్తు కాదు: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambava Rao
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

"జగన్ చాలా మొండివాడు. ధైర్యవంతుడు కూడా. ఆయన కాం గ్రెస్ పార్టీలోకి వస్తానంటే.. పార్టీలో పెద్దపీట వేస్తాం'' అని రాయపాటి అన్నారు. వైయస్ జగన్ పార్టీతో స్నేహబంధం ప్రసక్తే లేద ని పిసిసి అధ్యక్షుడు బొత్స వ్యాఖ్యానించిన మరుసటి రోజే రాయపాటి ఈ విధంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా.. చంచల్‌గూడ జైల్లో తాను మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లను మాత్రమే కలిశానని రాయపాటి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులను తీసుకురావటంలో మన పార్లమెంటు సభ్యులు విఫలమయ్యారని విమర్శించారు.

తెలంగాణకు అడ్డుపడే మంత్రులు, వైఖరి చెప్పని పార్టీల నాయకులను కాల్చిపారేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించడంపై రాయపాటి మండిపడ్డారు. తెలంగాణ ఆమె సొత్తేమీ కాదని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

English summary
Congress Guntur MP Rayapati Samabasiva Rao said that they will invite YSR Congress president YS Jagan into Coongress, if he wants. He retaliated Telangana Jagruthi president Kalwakuntla Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X