'ఆజాద్ హిందూ ఫౌజ్' కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూత

ఆమె చేసిన సేవలకు కల్నల్ ర్యాంకు లభించింది. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అబ్దుల్ కలాంపై వామపపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు 1998లో ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చింది. 1914 అక్టోబరు 14న మద్రాసులో లక్ష్మీ సెహగల్ జన్మించారు.
1940లో డాక్టర్ లక్ష్మీ సెహగల్ సింగపూర్‌లో సైనికులకు వైద్య సహాయం అందించే వారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోసు పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంటులో చేరి సెహగల్ సేవలందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక 1971లో సిపిఎంలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1947లో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్‌తో వివాహం అయ్యాక ఆమె కాన్పూర్‌లో స్థిరపడ్డారు.












Click it and Unblock the Notifications