వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎంత సంపాదిస్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీకి రూ. 1.5 లక్షల నెలసరి వేతనం లభిస్తుంది. ఆయన రాష్ట్రపతి భవన్‌లో ఉంటారు. సిమ్లా, హైదరాబాదుల్లో విడిదులు ఉంటాయి.

ఆయనకు బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన మెర్సిడీస్ బెంజ్ కారు అధికారికంగా కేటాయిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో 200 మంది సిబ్బంది ఉంటారు. ప్రస్తుత రేట్ల ప్రకారం పదవీ విరమణ చేసిన తర్వాత నెలకు 75 రూపాయల చొప్పున ఆయన పొందుతారు. అద్దె లేకుండా వసతులతో కూడా భవంతి (ఎనిమిదో టైప్) కేటాయిస్తారు.

పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు ఉచితంగా రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఓ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ప్రభుత్వం ఓ వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఐదుగురు వ్యక్తిగత సిబ్బందిని సమకూరుస్తుంది. ఓ ప్రభుత్వ కారు కూడా ఆయనకు ఇస్తారు. సిబ్బంది ఖర్చుల కింద ఏడాదికి 60 వేల రూపాయలు ఇస్తుంది. ఒకరి తోడుతో ఆయన విమానంలో గానీ రైలులో గానీ ఉచితంగా ప్రయాణించవచ్చు.

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ నెల 25వ తేదీన ఉత్సవాలు జరుపుకోనున్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వతా పెద్ద యెత్తున ఉత్సవం చేసుకుంటామని ఆయన కూతురు శర్మిష్ట చెప్పారు. దుర్గా పూజను రాష్ట్రపతి భవన్‌లో చేసుకోబోమని, దుర్గాపూజ ప్రణబ్ ముఖర్జీ స్వగ్రాం మిరాటిలోనే జరుగుతుందని, రాష్ట్రపతి భవన్‌ను లౌకికవాదానికి ప్రతీకగా ఉంచుతారని ఆమె అన్నారు.

English summary
As president, Pranab Mukherjee will draw a salary of Rs.1.5 lakh a month.He will get to stay in the imposing Rashtrapati Bhavan, and have retreats in Shimla and Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X