హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ దీక్షపై బొత్స కౌంటర్, జగన్‌తో లాలూచిపై...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ పార్టీకి మిత్రపక్షం కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. ఆయన గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పార్టీతో తాము కుమ్మక్కు కాలేదన్నారు. తమకు ఏ పార్టీతోను కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు. జగన్ తల్లి వంటి కాంగ్రెసును మోసం చేసి వెళ్లారన్నారు. అలాంటి వారితో తమకు కుమ్మక్కు ఏమిటన్నారు.

అయితే కాంగ్రెసు పార్టీ విధానాలు, పథకాల పట్ల ఆకర్షితులపై వచ్చే వారిని మాత్రం ఆహ్వానిస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేపట్టిన చేనేత దీక్ష రాజకీయ దీక్షగా ఆయన అభివర్ణించారు. దీక్షలు చేపట్టే నేతలు మొదట ఆ ప్రాంత సమస్యలను అవగతం చేసుకోవాలన్నారు.

అమెది పక్కా రాజకీయ యాత్రే అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆ దీక్ష అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే విజయమ్మ దీక్షకు ప్రభుత్వం భద్రత కల్పించిందని వివరణ ఇచ్చారు. శాంతి భద్రత బాధ్యతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చునని, చేనేత కార్మికులకు పెన్షన్ అవకాశం కల్పించడమే కాంగ్రెసు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

సిరిసిల్ల పర్యటనతో వైయస్సార్ కాంగ్రెసు ఏమి సాధించిందో అర్థం కావడం లేదన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వారని ఉపేక్షించే సమస్యే లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి బిసిలు దగ్గరవుతున్నారనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిసి డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బిసిల మద్దతు కోసమే బాబు డిక్లరేషన్ చేశారని, దానిని ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ కాలం నుండి కాంగ్రెసు బడుగుల సేవలో ఉందన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana questioned YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma on her sircilla tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X