వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా నేతలంతా కష్టపడతారు: ప్రణబ్, తెలంగాణపై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నేతలు అందరూ తనకు నచ్చిన వారేనని నూతనంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ మంగళవారం తెలుగు టివి ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. ఆంధ్రా నాయకులు అందరికీ కష్టపడే మనస్తత్వం ఉందన్నారు. రాష్ట్రపతిగా తాను అందరూ గర్వించే విధంగా నిర్వహిస్తానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. నిన్నటి వరకు తాను కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు తాను అందరి వాడినని చెప్పారు.

స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహా రావు, సంజీవ రెడ్డి తదితర నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా తెలంగాణ అంశంపై ప్రశ్నించగా మాట్లాడేందుకు ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. కాగా ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

యుపిఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. మాజీ స్పీకర్ పిఏ సంగ్మా ప్రణబ్ పైన పోటీకి దిగారు. ఇతనికి భారతీయ జనతా పార్టీతో సహా ఎన్డీయే పక్షాలు మద్దతిచ్చాయి. జెడి(యు), శివసేన మాత్రం ప్రణబ్‌కే మద్దతిచ్చాయి. ఈ ఎన్నికలలో ప్రణబ్ గెలుపు ఖాయమనే అందరూ భావించినప్పటికీ, సంగ్మా మాత్రం 1969 పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కానీ ఆయన భావించినట్లుగా 1969 పునరావృతం కాక పోవడమే కాకుండా ఘోర పరాజయం పాలయ్యారు. కర్నాటకలో అధికార బిజెపి పక్షం పూర్తి ఓట్లు కూడా సంగ్మాకు పడలేదు. సుమారు పదిహేడు ఓట్లు క్రాస్ అయ్యాయి. అవి ప్రణబ్ ముఖర్జీకి పడ్డాయి.

English summary
Pranab Mukherjee praised Andhra Pradesh leaders on Tuesday in TV channels interview. He did not like to respond on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X