వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవార్‌కు తలొగ్గిన కాంగ్రెసు: కథ సుఖాంతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia-Pawar
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి డిమాండ్లకు కాంగ్రెసు అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో యుపిఎ భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెసు, ఎన్సీపికి మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం ముగిసి, కథ సుఖాంతమైంది. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు అగ్రనాయకత్వం అంగీకరించింది.

శరద్ పవార్ తన డిప్యూటీ ప్రఫుల్ పటేల్‌తో కలిసి బుధవారం సాయంత్రం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. సమన్వయలోపం, కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాలతో అసంతృప్తికి గురైన శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది రోజుల వివాదం ముగిసిపోయిందని సోనియా, మన్మోహన్‌లతో భేటీ తర్వాత ప్రఫుల్ పటేల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఓ సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, యుపిఎ మిత్రపక్షాలు నెలకు ఒకసారి సమావేశమై విధాన నిర్ణయాలపై, ఇతర విషయాలపై చర్చించనున్నట్లు సమావేశానంతరం ఓ ప్రకటన వెలువడింది. ఢిల్లీలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీకి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తారని ప్రఫుల్ పటేల్ చెప్పారు.

మహారాష్ట్ర సంకీర్ణంలోని కాంగ్రెసు, ఎన్సిపీలతో రాష్ట్ర స్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇరు పార్టీల ప్రతినిధులు ఉంటారని ఆయన చెప్పారు. 2014 వరకు తమ పార్టీ యుపిఎలో ఉంటుందని ఆయన చెప్పారు.

English summary
The stand-off between Congress and NCP came to an end today with the decision to set up a coordination committee to address the grievance of the UPA ally from Maharashtra about not having a proper say in the functioning of the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X