లేడీపై లైంగిక దాడి: యుఎస్‌లో భారత అధికారి అరెస్టు

USA Flag
పెన్సిల్వేనియా: ఓ మహిళా ఉద్యోగి పట్ల లైంగిక దాడికి పాల్పడిన భారత ఉన్నతాధికారి ఒకరు అమెరికాలో అరెస్టయ్యాడు. పెన్సిల్వేనియాలోని ఓ హోటల్ ఉద్యోగినిపై అతను అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన సంయుక్త కార్యదర్సి స్థాయి అధికారి సురేంద్ర మహాపాత్ర పెన్సిల్వేనియాలోని మాటోమోరస్‌లో గత రాత్రి అరెస్టయ్యాడు. న్యూయార్క్‌లో సైరకుస్ విశ్వవిద్యాలయంలోని వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వెళ్లిన 34 మంది అధికారుల్లో ఆయన ఒకరు.

పోలీసులు సురేంద్ర మహాపాత్ర పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. మహాపాత్రకు న్యాయవాదిని ఏర్పాటు చేసి బెయిల్ పొందడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతను అధికారిక పాస్‌పోర్టుపై అమెరికా వెళ్లాడు. దౌత్యపరమైన పాస్‌పోర్టుపై అతను వెళ్లలేదు. దీంతో దౌత్యపరమైన సౌకర్యాలు ఉంటాయా, లేదా అనేది తేలడం లేదు.

మిగతా అధికారుల బృందం తమ అధ్యయన పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డిసికి బయలుదేరి వెళ్లింది. మహాపాత్రకు సహాయం చేయడానికి కోర్సు సమన్వయకర్త ధర్మేంద్ర భార్గవ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. మహాపాత్ర ఉంటున్న అంతస్థులోనే భార్గవ కూడా దిగారు. ఇంటర్నెట్ సమస్య ఉందని అధికారులు చెబుతున్నారని మహాపాత్ర తనతో రాత్రి తొమ్మిదిన్నర, పది గంటల మధ్య అన్నాడని ధర్మేంద్ర చెబుతున్నారు. హోటల్ సిబ్బందికి చెప్పడంతో ఓ మహిళను పంపించారని, ఆమె కూడా కనెక్షన్‌ను పునరుద్ధరించలేకపోయిందని, ఆమె కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాలపాటు మాత్రమే తన గదిలో ఉందని మహాపాత్ర అన్నట్లు ఆయన తెలిపారు.

మహాపాత్ర వృద్ధుడు, జెంటిల్‌మన్ అని, మహిళ వెళ్లిపోయిన తర్వాత తన ల్యాప్‌ట్యాప్‌పై పనిచేస్తూ భార్గవ కనిపంచారని ఆయన చెప్పారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు అంతా బాగానే ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసిందని అంటున్నారు. ఎవరూ మద్యం కూడా సేవించలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+