శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరంపై రాజకీయం: చేలో వరి నాటేసిన సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరి చేనులో నాటు వేశారు. శుక్రవారం ఉదయం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలోని అక్కులపేటలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రైతు వరి చేనులో ఆధునిక యంత్రంతో వరి నాటు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కులపేటలోని వంశధార ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తనిఖీ చేశారు. మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు చాలా అవసరమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. నదీ జలాలకు సంబంధించి ఓడిషా తీర్పుపై ట్రిబ్యునల్ వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం విషయమై ఛత్తీస్‌గఢ్, ఒడిషా ముఖ్యమంత్రులతో మాట్లాడతానని చెప్పారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు జలయజ్ఞం కోసం రూ.26 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. ముందు ముందు దీనిని 30 లక్షల ఎకరాలకు పెంచుతామని చెప్పారు.

ప్రతి మండలంలో మినీ స్టేడియం కడతామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో ఆయా అధికారులు బస చేసి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో ఒకరోజు బస చేసి స్థితిగతులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఆయన ఆధునిక యంత్రంతో వరి నాటు వేశారు. అంతకుముందు మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

English summary

 CM Kiran Kumar Reddy has started Indira Bata In Srikakulam district on Friday. he was launched Vamshadhara lift irrigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X