విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులున్న విమానాన్ని ఢీకొన్నపక్షి, తప్పిన ముప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
విజయవాడ: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో శనివారం త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కేంద్ర మంత్రి పురందేశ్వరి రాష్ట్రమంత్రి సి.రామ చంద్రయ్య, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వంటి ప్రముఖులున్న స్పైస్‌జెట్ విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో విమానాశ్రయ అధికారులు భయభ్రాంతులయ్యారు. అయితే ల్యాండవుతున్న సమయంలోనే పక్షి ఢీకొనడం వల్ల విమానం రన్‌వే చివరకు వెళ్లి ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న స్పైస్‌జెట్ విమానం హైవే వైపు నుంచి రన్‌వే మీదకు దిగి బుద్ధవరం వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో రన్‌వే చివరి భాగానికి చేరేసరికి ఓ గద్ద విమానం ఎడమవైపు ఇంజన్ రెక్కలలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం గమనించిన రన్‌వే భద్రతా సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే విమానం క్షేమంగా ఆప్రాన్ వద్దకు చేరుకుంది.

క్షేమంగా ల్యాండై, దిగుతున్న ప్రయాణికులు.. విమానాశ్రయ అధికారుల హడావుడి చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం తెలుసుకుని ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు ప్రముఖులు వున్నారు. వీరిలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి. రాష్ట్రమంత్రి సి.రామచంద్రయ్య, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి ప్రముఖులు ఉండడం గమనార్హం.

వీరికి స్వాగతం పలికేందుకు వచ్చిన అధికారులు, ప్రజలు పెనుప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాదానికి గురైన విమానాన్నిమరమ్మతుల నిమిత్తం గన్నవరంలోనే ఉంచేశారు.

English summary
A bird collided with aeroplane near Gannavaram 
 
 airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X