'కూచిపూడి' గురువు వెంపటి చిన సత్యం కన్నుమూత

కూచిపూడిని సత్యం ప్రపంచవ్యాప్తం చేశారు. రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణ పారిజాతం, క్షీరసాగర మథనంలు వెంపటి చిన సత్యంగా మంచి పేరు తీసుకు వచ్చాయి. ఈయన కూచిపూడి నృత్యానికే తన జీవితాన్ని అంకితం చేశారు. 1963లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని చెన్నైలో స్థాపించారు.
నర్తనశాల సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ బృహన్నల పాత్రకు నృత్య కల్పన చేసి పేరు సంపాదించుకున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని, తెలుగు నటులు ప్రభ, వైజయంతిమాలలకు నాట్య గురువుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ తనయ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరికి కూడా ఆయన నాట్య గురువు.
కేంద్ర ప్రభుత్వం ఆయనను 1956లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సంగీత నాటక ఫెల్లో షిప్‌తో 1967లో ఆయనను గౌరవించారు. వీటితో పాటు ఆయన పలు ఆవార్డులు రివార్డులు అందుకున్నారు.












Click it and Unblock the Notifications