నిమ్మగడ్డకు కోర్టులో చుక్కెదురు: బెయిల్ నిరాకరణ

ఇరువైపులా సాగిన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేకర కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద రావు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది.
వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 842 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా ఆయన వాన్‌పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుకూలంగా అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని, వీరిద్దరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.
మంత్రివర్గం నిర్ణయానికి విరుద్ధంగా ప్రసాద్‌కు మేలు చేయడానికి జీవోలు జారీ చేశారని అంటున్నారు. వాన్‌పిక్‌కు కేటాయించడానికి భూములను రిజర్వ్ చేయాలని రెండు జిల్లా కలెక్టర్లకు కూడా బ్రహ్మానంద రెడ్డే లేఖ రాశారని అంటున్నారు. బ్రహ్మానంద రెడ్డిని వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా చేర్చాలని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications