వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఏడాది జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodali Nani
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి కైకలూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వేయి రూపాయల జరిమానా విధించింది. శవంతో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు నానిని దోషిగా కోర్టు నిర్ధారించి, శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో నానికి 353 సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష, 426 సెక్షన్ కింద వేయి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

నాని 2005లో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. అప్పీల్‌ కోసం నానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. గుడివాడ శాసనసభా నియోజకవర్గంలో మోషి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తనకు అందడం లేదని ఆరోపిస్తూ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు అతని శవంతో నాని వందలాది మందితో ధర్నా చేశాడు. ధర్నా రోజంతా సాగింది. నాని ధర్నాపై అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. సాక్షులను విచారించిన తర్వాత కోర్టు సోమవారం ఈ కేసులో తీర్పును వెలువరించింది.

తెలుగుదేశం పార్టీని గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తరఫున గుడివాడ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
Krishna district Kaikaluru court ordered one year imprisonment and thousand rupees fine to Guduvada MLA Kodali Nani in a case related to staged dharna infront of RDO office in 2005. Court has given one month time to Nani to go for appeal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X