నార్త్ గ్రిడ్ వైఫల్యం: 8 రాష్ట్రాల్లో అంధకారం

North grid failure: dark in 7 states
న్యూఢిల్లీ: నార్త్ గ్రిడ్ విఫలం చెందడంతో ఉత్తర భారతదేశంలోని 8 రాష్ట్రాల్లో అంధకారం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఏడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీనివల్ల ఢిల్లీపై ఎక్కువ ప్రభావం పడింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ సహా పలు రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పలు రైల్వే స్టేషన్లలో దాదాపు 200 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.

విద్యుత్ వ్యవస్థలో లోపం కారమంగాన సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమికంగా భావించినప్పటికీ ఓ రాష్ట్రం అధిక విద్యుత్‌ను తీసుకోవడానికి ప్రయత్నించడంతో గ్రిడ్ విఫలమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 40 శాతం విద్యుత్తును పునరుద్ధరించినట్లు కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. అధిక లోడ్ కారణంగానే ఉత్తర గ్రిడ్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని ఆయన అన్నారు.

పునరుద్ధరించిన విద్యుత్తు సరఫరాను అత్యవసర సర్వీసులకు మాత్రమే అందిస్తామని ఆయన చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ఉత్తర గ్రిడ్‌ పరిధిలోని మిగతా ప్రాంతాలకు కూడా విద్యుత్తు సరఫరాను అందిస్తామని ఆయన చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యుత్తును తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

పవర్ సిస్టమ్ ఆపరేటింగ్ కో దీన్ని నిర్వహిస్తోంది. నార్త్ గ్రిడ్‌లో సమస్య తలెత్తిన విషయం నిజమేనని, పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని కార్పోరేషన్ సివో ఎస్కె సూనీ చెప్పారు. గ్రిడ్ వైఫల్యానికి కచ్చితమైన కారణం తెలియదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+