రైలు ప్రమాదం: విద్రోహచర్యనా, షార్ట్ సర్క్యూటా?

మంటలు చెలరేగడానికి ముందు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు. బోగీలో ఓ కిరోసిన్ డబ్బా కూడా కనిపించినట్లు తెలుస్తోంది. టీటీఈలను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 47 మంది మరణించినట్లు అదనపు డిజి చెప్పారు. ప్రమాదం స్థలంలో హృదయవిరాక దృశ్యాలు ఉన్నాయి. చాలా మృతదేహాలు కాలిబూడదై గుర్తు పట్టరాకుండా ఉన్నాయి.
కాగా, ప్రయాణికుల వివరాలను [email protected]కు మెయిల్ చేయాలని అదనపు డిజి కోరారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, విజయవాడల్లో మాత్రమే స్టాపులున్నాయి. విజయవాడలోనూ, వరంగల్‌లోనూ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు రైలులో ఎక్కారు. ఇదిలా వుంటే, ప్రయాణికుల బాధితులతో చెన్నై నుంచి ఓ ప్ర్తత్యేకమైన రైలు ఘటనా స్థలానికి చేరుకుంది.
ఎస్ - 10కి కూడా మంటలు అంటున్నాయి. అయితే, ఈ బోగీలో ప్రమాద నష్టం తక్కువగానే ఉంది. ఎస్ -11 బోగీ మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఎస్-11 బోగీలో 72 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 40 - 45 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు అంటున్నారు. అయితే, కొంత మంది ఆస్పత్రిల్లో చేరి ఉండవచ్చునని అంటున్నారు. తొలుత షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు భావించారు. కానీ, టిటిఈలను విచారించిన తర్వాత విద్రోహ కోణంపై దృష్టి పెట్టారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చెన్నై చేరుకోవాల్సి ఉండింది. విజయవాడ, చెన్నై నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంఘటనా స్థలానికి బయలుదేరారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల్లూరులోని వివిధ ఆస్పత్రుల్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications