హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం సిండికేట్‌పై దాడులు: బొత్సపై సుప్రీంలో పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మద్యం టెండర్లలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. మద్యం టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయంటూ గతంలో ఎసిబి(అవినీతి నిరోధక శాఖ) మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించిందని, అయితే అందుకు బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని హైదరాబాదుకు చెందిన గిరి యాదవ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ టెండర్లకు సంబందించి బొత్స అక్రమాలకు పాల్పడ్డారని గిరి యాదవ్ తన పిటిషన్‌‍లో పేర్కొన్నారు. బొత్స తదితరుల అక్రమాలను ఎసిబి గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, దీనిపై విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. బొత్సతో పాటు ఈ టెండర్ల అక్రమాలలో పలువురు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది సుమారు రూ.17వేల కోట్ల కుంభకోణమని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.

బొత్స బినామీల పేరుతో మద్యం దుకాణాలు నడిపారని, వాటి పైనా చర్యలు తీసుకోలేదన్నారు. టెండర్లలో అక్రమాలు, బినామీల పేరుతో వ్యాపారం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.

కాగా ఇటీవల కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులలో పలు దుకాణాలు మూసివేయడంతో పాటు అరెస్టులు కూడా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ బొత్సను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారనే ప్రచారం జరిగింది. బొత్స ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి మొర పెట్టుకోవడం, కాంగ్రెసు పెద్దలు ఇరువురికి మొట్టికాయలు వేయడంతో ఈ సమస్య సమసిపోయిందనే వార్తలు వచ్చాయి.

English summary
Giri Yadav from Hyderabas has filed at petition against PCC chief Botsa Satyanarayana in Supreme Court on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X