దక్కన్ క్రానికల్ క్రైసిస్: చైర్మన్ వెంకట్రామిరెడ్డి వివరణ

డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, రుణ ఒప్పందాల కింద చెల్లింపుల జాప్యం గురించి కొద్ది రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.
అసలు సమస్య ద్రవ్యలభ్యత సంక్షోభమనీ... ఇండియాలో దేశీయ, మల్టీనేషనల్ కంపెనీలు అడ్వర్టయిజ్‌మెంట్ ఖర్చును గణనీయంగా తగ్గించిన కారణంవల్ల ఇది ఉత్పన్నమైందనీ యాజమాన్యం స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, యూరోపియన్ సంక్షోభాల ప్రభావం భారత ఆర్థిక రంగంపై గణనీయంగా పడింది.
డక్కన్ క్రానికల్ సంస్థ నికర విలువ ఇప్పుడు చెల్లించవలసిన బకాయిలకంటే చాలా ఎక్కువ. రుణాల బకాయిలు, ఇతర బాకీలు కడచిన రెండునెలలలో జరగవలసిన చెల్లింపులకు సంబంధించినవి మాత్రమే.
75 ఏళ్ల చరిత్రగల అగ్రగామి దినపత్రికగా డక్కన్ క్రానికల్ విలువ, భూములు, భవనాల స్థిరాస్థి విలువ, చాలా ప్రాంతాల్లోని ప్లాంట్లు, మెషినరీ విలువ, డక్కన్ చార్జర్స్ ఐ.పి.ఎల్. టీము విలువ కంపెనీకున్న రుణభారం కంటే చాలా ఎక్కువ.
కంపెనీ చేసిన అప్పు మామూలు వ్యాపార నిర్వహణ క్రమంలో చేసినదే. అది వేలకోట్ల రూపాయల్లో ఉన్నట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నది అబద్ధం. ఢిల్లీ ట్రిబ్యునల్ వద్ద రుణం రికవరీకి కేసు వేసిన ఐ.ఎఫ్.సి.ఐ 25 కోట్ల రూపాయల చెల్లింపులో జాప్యానికిగాను కంపెనీ లిక్విడేషనుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకో పిటిషన్‌ను వేసింది.
ఇంతకాలం తన కార్యకలాపాలన్నిటిలో అండగా నిలిచిన రుణదాతలకు డక్కన్ క్రానికల్ సంస్థ కృతజ్ఞతను, సంపూర్ణ నిబద్ధతను తెలియజేస్తున్నది. ప్రస్తుత ద్రవ్య సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు వారితో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నది.
- టి.వెంకట్రామ్‌రెడ్డి
చైర్మన్, డి.సి.హెచ్.ఎల్
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications